

టాక్సిక్ సినిమాకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారంపై బెంగళూరు కోర్టు స్పందించింది. ఫేక్, పరువు నష్టం కలిగించే కంటెంట్‌ను ప్రచారం చేస్తున్నారంటూ చిత్ర నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా టాక్సిక్‌కు సంబంధించి తప్పుడు లేదా పరువు నష్టం కలిగించే కంటెంట్‌ను ప్రచురించడం, షేర్ చేయడాన్ని నిషేధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
సినిమాను ఉద్దేశపూర్వకంగా కించపరిచేలా తప్పుడు వార్తలు లేదా కంటెంట్‌ను సృష్టించి ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకుంటామని కోర్టు హెచ్చరించింది. టాక్సిక్‌కు సంబంధించిన అభ్యంతరకరమైన కంటెంట్‌ను మీడియాలో లేదా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో పోస్ట్ చేయడం, స్ట్రీమింగ్ చేయడం, షేర్ చేయడం వంటివి చేయకూడదని స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వులు సెప్టెంబర్ 28 వరకు అమల్లో ఉంటాయని తెలిపింది. కోర్టు విధించిన నిబంధనలను ఉల్లంఘిస్తే ముందస్తు నోటీసు లేకుండానే ఉత్తర్వులను రద్దు చేసే అవకాశం ఉందని న్యాయస్థానం పేర్కొంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!