
జనరల్

నేపాల్‌లోని రసువా జిల్లాలో భోటే కోసి నదిలో ఆకస్మికంగా వరదలు సంభవించడంతో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ వరదల్లో పలువురు యాత్రికులు గల్లంతైనట్లు ప్రాథమిక సమాచారం వెలువడింది. పర్యాటక, ప్రయాణ సంస్థల నుంచి ఏజెన్సీల వారీగా అందిన సమాచారాన్ని బట్టి ఇప్పటివరకు 384 మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. అయితే ఈ వివరాలు ప్రాథమికమైనవే కావడంతో అధికారుల ధ్రువీకరణ అనంతరం సంఖ్యల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది.
గల్లంతైన వారిలో 105 మంది భారతీయులు, 186 మంది ఇతర విదేశీయులు, 93 మంది నేపాలీ పౌరులు ఉన్నట్లు సమాచారం. సహాయక, గాలింపు చర్యలు కొనసాగుతున్న నేపథ్యంలో గల్లంతైన వారి వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు. బాధితుల సంఖ్య, వారి ప్రస్తుత పరిస్థితిపై మరింత స్పష్టమైన సమాచారం అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!