

దర్శకుడు శ్రీను వైట్ల, హీరో శర్వానంద్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న కొత్త చిత్రం జార్జ్ క్రిష్‌పై ఆసక్తికరమైన అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా షూటింగ్ రేపటి నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లోనే లాంగ్ షెడ్యూల్‌ను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్‌లో ముందుగా సినిమా ఓపెనింగ్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారని, ఆ తర్వాత శర్వానంద్‌పై ఓ పాటను షూట్ చేయనున్నారని టాక్ వినిపిస్తోంది.
ఈ సినిమాలో హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సేను ఎంపిక చేసినట్లు సమాచారం. చిన్న వయసులో ఆవేశంతో హీరో చేసే ఓ నిర్ణయం అతని జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చాయనే అంశం చుట్టూ కథ సాగుతుందని తెలుస్తోంది. డ్రామాతో పాటు శ్రీను వైట్ల మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు కూడా సినిమాలో ప్రాధాన్యత ఉండనుందని టాక్. గతంలో గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల తెరకెక్కించిన యాక్షన్ కామెడీ విశ్వం యావరేజ్‌గా నిలిచిన నేపథ్యంలో, జార్జ్ క్రిష్‌తో దర్శకుడు మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!