

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ చిత్రం ఇప్పటికే సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొల్పింది. ఈ సినిమాలో ఇమాన్వీ కథానాయికగా నటిస్తుండగా, విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను అక్టోబర్‌లో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా, ‘ఫౌజీ’కి సంబంధించిన మరో ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలీవుడ్ ప్రముఖ నిర్మాత అనిల్ తాడని ఈ చిత్ర హిందీ థియేట్రికల్ హక్కులను భారీ మొత్తానికి సొంతం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఉత్తర భారత మార్కెట్లో ఆయనకున్న బలమైన పంపిణీ వ్యవస్థ కారణంగా సినిమాకు భారీ స్థాయిలో విడుదల లభించే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. సినిమా మంచి టాక్ అందుకుంటే హిందీ బాక్సాఫీస్ వద్ద కూడా భారీ వసూళ్లు సాధించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!