

భారతీయ సినీ పరిశ్రమలో ‘అతిలోక సుందరి’గా చెరగని ముద్ర వేసిన శ్రీదేవి జయంతి సందర్భంగా ఆమె అభిమానులు మరోసారి ఆమె సినీ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటున్నారు. బాలనటిగా కెరీర్ ప్రారంభించిన ఆమె తెలుగు, తమిళం, హిందీ చిత్రాల్లో అగ్ర కథానాయికగా ఎదిగారు. 2018 ఫిబ్రవరి 24న దుబాయ్‌లోని ఓ హోటల్‌లో ఆమె ఆకస్మికంగా మృతి చెందడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఫోరెన్సిక్ నివేదికలో ప్రమాదవశాత్తూ బాత్‌టబ్‌లో మునిగి మరణించినట్లు వెల్లడైంది.
శ్రీదేవి మరణంపై తనను దుబాయ్ పోలీసులు సుమారు 48 గంటలపాటు విచారించారని, లై డిటెక్టర్ పరీక్ష కూడా నిర్వహించారని బోనీ కపూర్ గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఎలాంటి కుట్ర లేదా ఫౌల్ ప్లే లేదని తేలిన తర్వాత తనకు క్లీన్ చిట్ ఇచ్చారని చెప్పారు. శ్రీదేవి కఠినమైన డైటింగ్ కారణంగా లో బీపీతో బాధపడేవారని, ఉప్పును పూర్తిగా మానేసే అలవాటు ఉండేదని బోనీ వెల్లడించారు. గతంలోనూ డైటింగ్ కారణంగా ఆమె బాత్‌రూమ్‌లో కళ్లు తిరిగి పడిపోయిన ఘటనను నాగార్జున ప్రస్తావించినట్లు తెలిపారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!