

శ్రీను వైట్ల, శర్వానంద్ కాంబినేషన్లో తెరకెక్కనున్న ‘జార్జ్ క్రిష్’ ఇప్పటికే గ్రాండ్‌గా ప్రారంభమైంది. 2027 సంక్రాంతి సందర్భంగా జనవరి 14న సినిమాను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ విడుదల తేదీపై ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం సినిమాకు 90 రోజులకు పైగా షూటింగ్ అవసరం కానుందని టాక్. ఈ లెక్కన జనవరి 14న విడుదల చేయాలంటే చిత్రీకరణతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా అత్యంత వేగంగా పూర్తి చేయాల్సి ఉంటుంది.
డబ్బింగ్, పాటల చిత్రీకరణ, గ్రాఫిక్స్, ప్రమోషన్స్, సెన్సార్ వంటి కీలక పనులకు కూడా సమయం కేటాయించాలి. ముఖ్యంగా సంక్రాంతి వంటి పెద్ద సీజన్లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలంటే ప్రమోషన్‌కు సరైన సమయం ఉండటం చాలా అవసరం. ఇప్పటికే వరుస పరాజయాలతో ఉన్న శ్రీను వైట్లకు ఈ సినిమా కీలకంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం 5 నెలల్లో అన్ని పనులు పూర్తి చేసి సంక్రాంతి బరిలో నిలవడం ఎంతవరకు సాధ్యమనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరి ప్రకటించిన తేదీకి సినిమా వస్తుందా అనేది చూడాలి.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!