

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబినేషన్ మరోసారి తెరపైకి రానుందనే ప్రచారం సినీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. ఇటీవల విడుదలైన ‘పెద్ది’తో ఇద్దరూ భారీ విజయాన్ని అందుకున్న నేపథ్యంలో ఈ జోడీ మళ్లీ చేతులు కలపబోతుందనే వార్త అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. స్పోర్ట్స్ నేపథ్యంలో రూపొందిన ఆ చిత్రం చరణ్ కెరీర్‌లో ప్రత్యేక స్థానం సంపాదించగా, ఆయన నటనతో పాటు బుచ్చిబాబు రూపొందించిన కథనం ప్రశంసలు అందుకుంది. ఈ విజయంతో సంతోషించిన చరణ్ మరోసారి కలిసి పని చేద్దామని దర్శకుడికి మాటిచ్చినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆ హామీ అమలవుతున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ సాగుతోంది.
తాజా సమాచారం ప్రకారం ఓ ప్రముఖ నిర్మాత ద్వారా బుచ్చిబాబుకు భారీ అడ్వాన్స్ అందినట్లు తెలుస్తోంది. త్వరలోనే ప్రత్యేక కార్యాలయం ప్రారంభించి కథ అభివృద్ధి పనులు మొదలుపెట్టనున్నట్లు సమాచారం. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో చేయనున్న చిత్రంపై దృష్టి పెట్టిన చరణ్, అది పూర్తైన వెంటనే ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. గత విజయాన్ని మించి మరింత భారీ స్థాయిలో సినిమా రూపొందించాలని హీరో, దర్శకుడు ఇద్దరూ ఆలోచిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అధికారిక ప్రకటన వెలువడకపోయినా ఈ వార్త సోషల్ మీడియాలో వేగంగా చక్కర్లు కొడుతోంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!