

డ్యాన్స్ షూటింగ్‌లో గాయపడిన నటి రష్మిక మందన్న ప్రస్తుతం షూటింగ్స్‌కు దూరంగా ఇంట్లో విశ్రాంతి తీసుకుంటోంది. వైద్యులు ఆమెకు సుమారు ఆరు వారాల విశ్రాంతి అవసరమని సూచించినట్లు తెలుస్తోంది. దీంతో తన సాధారణ బిజీ షెడ్యూల్‌కు బ్రేక్ ఇచ్చి రికవరీపై దృష్టి పెడుతోంది.
ఈ క్రమంలో తన ప్రస్తుత జీవితం ఎలా సాగుతోందో చూపిస్తూ రష్మిక కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. ఎప్పుడూ షూటింగ్స్, ప్రయాణాలు, ఇతర పనులతో బిజీగా ఉండే తనకు ఎక్కువ కాలం ఇంట్లో ఉండటం కొత్తగా అనిపిస్తోందని తెలిపింది. నిరంతరం పరుగులు తీసే జీవితంలో విశ్రాంతి తీసుకోవడం మొదట్లో భయానకంగా అనిపిస్తుందని పేర్కొంది.
అయితే పరిస్థితుల కారణంగా విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చినప్పుడు జీవితాన్ని మరో కోణంలో చూడగలుగుతున్నానని రష్మిక చెప్పింది. తనపై అభిమానులు చూపిస్తున్న అపారమైన ప్రేమ, పాజిటివిటీ, ప్రార్థనలు, మద్దతుకు కృతజ్ఞతలు తెలిపింది. ఈ దశలో లభిస్తున్న ప్రేమ, ఆప్యాయత మధ్య గడపడం ఎంతో అద్భుతంగా ఉందని పేర్కొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!