
రాజకీయాలు

రామ్‌చరణ్ కథానాయకుడిగా, బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా పెద్ది బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది. ఇందులో జాన్వీకపూర్ కథానాయికగా నటించగా, సంగీత మాంత్రికుడు ఏఆర్‌రెహమాన్ స్వరాలు సమకూర్చారు. సినిమా పాటలు విడుదలైన నాటి నుంచి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
అందులో ముఖ్యంగా ‘చికిరి చికిరి’ పాట విడుదలకు ముందే మిలియన్ల కొద్దీ వ్యూస్ సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. తాజాగా ఈ పాట ఫుల్ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. రామ్ చరణ్ ఎనర్జిటిక్ డ్యాన్స్, జాన్వీ కపూర్ గ్లామర్, అద్భుతమైన విజువల్స్ ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రస్తుతం ఈ వీడియోకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!