

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమాల్లో విశ్వంభర, కాకా ప్రస్తుతం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. విశ్వంభర షూటింగ్ ఇప్పటికే పూర్తికాగా, సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. మరోవైపు ఆ తర్వాత ప్రారంభమైన కాకా చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. తాజాగా కాకా సంక్రాంతికి వస్తుందని చిరంజీవి స్వయంగా చెప్పడంతో రెండు సినిమాల విడుదలపై కొంతకాలంగా ఉన్న సందిగ్ధతకు తెరపడింది.
కాకా సంక్రాంతి బరిలోకి రానుండటంతో విశ్వంభర అదే సమయంలో విడుదలయ్యే అవకాశం లేదని స్పష్టమైంది. దీంతో విశ్వంభరను ఈ ఏడాదిలోనే థియేటర్లలోకి తీసుకురావచ్చనే ప్రచారం మొదలైంది. నవంబర్‌లో సినిమాను విడుదల చేసే అవకాశం ఉందనే రూమర్స్ వినిపిస్తున్నప్పటికీ, దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. వశిష్ఠ దర్శకత్వం వహించిన ఈ సినిమా అవుట్‌పుట్‌పై మేకర్స్ సంతృప్తిగా ఉన్నారని టాక్. మరి విశ్వంభర రిలీజ్ డేట్‌పై ఎప్పుడు క్లారిటీ వస్తుందో చూడాలి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!