

టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. ఇటీవల కొన్ని సినిమాలు ఆశించిన విజయాన్ని సాధించకపోయినా, శ్రీశ్రీ, న్యూటన్స్ థర్డ్ లా, సలార్ 2, సంబరాల ఏటిగట్టు వంటి ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. షూటింగ్‌లతో బిజీగా ఉన్నప్పటికీ, అభిమానులతో ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలు పంచుకుంటూ ఉంటారు. తాజాగా ఆయన ఇంట్లోనే కుకీలు తయారు చేస్తూ ఒక వీడియోను పంచుకుని, తన పెద్ద కుమార్తె దగ్గర నుంచి నేర్చుకున్నానంటూ సరదాగా వ్యాఖ్యానించారు.
అయితే ఆ వీడియోలో ఆయన లుక్ చూసి అభిమానులు కాస్త ఆందోళన చెందారు. ముఖం వాపుగా, కళ్ల కింద నల్లటి వలయాలు కనిపించడంతో ఏమైందని ప్రశ్నలు వెల్లువెత్తాయి. దీనిపై స్పందించిన జగపతి బాబు, ఎవరూ తనను కొట్టలేదని, ఇటీవల చిన్న శస్త్రచికిత్స చేయించుకోవడం వల్లే ఇలా కనిపిస్తున్నానని స్పష్టం చేశారు. ప్రస్తుతం తాను పూర్తిగా క్షేమంగా ఉన్నానని చెప్పడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!