
జనరల్

దుల్కర్ సల్మాన్ హీరోగా, ‘RDX’ ఫేమ్ నహాస్ హిదాయత్ దర్శకత్వంలో క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఐ యామ్ గేమ్’ విడుదల తేదీని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రంలో కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఆంటోనీ వర్గీస్, సంయుక్త విశ్వనాథన్, మిస్కిన్, కతిర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఈ సినిమాను ఆగస్టు 20న ఓనం సందర్భంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దుల్కర్ సల్మాన్ సొంత బ్యానర్ ‘వేఫెరర్ ఫిలిమ్స్’తో పాటు జోయ్ వర్గీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా మలయాళం, తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!