

నటసింహం నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కలయికలో రూపొందుతున్న చిత్రం ఎన్‌బీకే 111పై సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. బాలకృష్ణ నటించిన పలు చిత్రాలకు సంగీతం అందిస్తున్న తమన్, ఈ సినిమాకు సంబంధించిన సంగీత పనులు దాదాపు పూర్తయ్యాయని తెలిపారు. ఇప్పటివరకు వచ్చిన సంగీతం అద్భుతంగా ఉందని చెప్పారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన తమన్.. ఈ సినిమాలో బాలకృష్ణను దర్శకుడు, ఛాయాగ్రాహకుడు అద్భుతంగా చూపించారని అన్నారు. ‘కాంతారా’ సినిమాకు పనిచేసిన ఛాయాగ్రాహకుడు ఈ చిత్రానికి పనిచేస్తున్నారని తెలిపారు. విడుదలైన గ్లింప్స్‌లో కనిపించిన బాలయ్య లుక్ కేవలం ఒక నమూనా మాత్రమేనని, సినిమాలో మరింత భారీగా ఉంటుందని చెప్పారు. చిత్రానికి శక్తివంతమైన టైటిల్ సిద్ధమైందని, అది ప్రకటించిన తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరుగుతాయని, సినిమా ఘన విజయం సాధిస్తుందని తమన్ ధీమా వ్యక్తం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!