
జనరల్

ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తొలిసారి వెండితెరపై నటుడిగా అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ‘బలగం’ ఫేమ్ వేణు యెల్దండి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఎల్లమ్మ’ చిత్రంలో దేవిశ్రీ ప్రసాద్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆగస్టు 2న ఆయన పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం సినిమాలోని ఆయన ఫస్ట్ లుక్ను విడుదల చేసింది. చేతిలో కిరీటం పట్టుకుని రెట్రో లుక్లో కనిపిస్తున్న దేవిశ్రీ ప్రసాద్ అభిమానులను ఆకట్టుకున్నారు.
‘ఎల్లమ్మ’ చిత్రంలో దేవిశ్రీ ప్రసాద్ డప్పు కళాకారుడి పాత్రలో కనిపించనున్నట్లు ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ద్వారా తెలుస్తోంది. మట్టి నేపథ్యంతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని కొత్త కథాంశంతో వేణు యెల్దండి తెరకెక్కిస్తున్నారు. వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!