

టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా శ్రీలంకతో జరగనున్న టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. ఎడమ మోకాలి నొప్పి సమస్య పూర్తిగా తగ్గకపోవడంతో అతడిని శ్రీలంక పర్యటనకు పంపకూడదని వైద్య బృందం నిర్ణయించినట్లు సమాచారం. జట్టులో ఎంపిక చేసినప్పటికీ, పూర్తి ఫిట్‌నెస్ సాధించిన తర్వాతే సిరీస్‌లో పాల్గొంటాడని సెలెక్టర్లు ముందే స్పష్టం చేశారు. ఆగస్టు 4న భారత జట్టు శ్రీలంకకు బయలుదేరనున్న నేపథ్యంలో బుమ్రా తప్పుకోవడం జట్టుకు పెద్ద నష్టంగా మారింది.
బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో నిర్వహించిన ప్రాథమిక పరీక్షల్లో బుమ్రా మోకాలి సమస్య గుర్తించినట్లు తెలుస్తోంది. పూర్తి కోలుకునే వరకు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. రాబోయే కీలక సిరీస్‌ల దృష్ట్యా బుమ్రా విషయంలో తొందరపాటు నిర్ణయం తీసుకోకూడదని భావిస్తున్నారు. అతడి స్థానంలో ఆకిబ్ నబీని ఎంపిక చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. దేశవాళీ క్రికెట్‌తో పాటు ఇండియా-ఎ తరఫున ఆకట్టుకునే ప్రదర్శన చేసిన ఆకిబ్ నబీ రేసులో ముందున్నాడు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!