

టాలెంటెడ్ హీరో ధనుష్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆయన కెరీర్‌లో ఇటీవల మంచి విజయాన్ని అందుకున్న చిత్రాల్లో సార్ కూడా ఒకటి. తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి, నిర్మాత నాగవంశీతో కలిసి చేసిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ విజయవంతమైన కాంబినేషన్ తర్వాత ధనుష్ మరోసారి నిర్మాత నాగవంశీతో కలిసి సినిమా చేయనున్నట్లు గతంలోనే వార్తలు వచ్చాయి.
తాజాగా ధనుష్ కెరీర్‌లో 59వ సినిమాను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. విజయ్ బి కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనుండగా, కన్నప్ప సినిమాలో నటించిన ప్రీతీ ముకుందన్ హీరోయిన్‌గా కనిపించనున్నారు. యంగ్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ సంగీతం అందించనుండటం ఈ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. తాజాగా విడుదల చేసిన పోస్టర్ చూస్తుంటే ఈ చిత్రం థ్రిల్లర్ నేపథ్యంతో తెరకెక్కుతున్నట్లు అనిపిస్తోంది. వచ్చే ఏడాది వేసవి కానుకగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ వెల్లడించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!