
సినిమాలు

బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘ఈథా’ చిత్రం లెజెండరీ మరాఠీ లావణి నృత్యకారిణి విఠాబాయి నారాయణగాంకర్ జీవిత కథ ఆధారంగా రూపొందుతోంది. ఈ చిత్రంలో రణదీప్ హుడా, అనంత్ జోషి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దినేష్ విజన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 26న విడుదల కానుంది.
తాజాగా విడుదలైన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. శ్రద్ధా కపూర్ మరాఠీ సంప్రదాయ వేషధారణలో కొత్త అవతారంలో కనిపించింది. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత మళ్లీ వేదికపై నృత్యం చేసే భావోద్వేగ సన్నివేశం టీజర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అజయ్-అతుల్ సంగీతం, అద్భుతమైన దృశ్యాలు, శ్రద్ధా నటనపై ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!