
జనరల్

ఇన్‌సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయులు విజయవాడలో ఆందోళనకు దిగారు. భారీ సంఖ్యలో విజయవాడకు చేరుకున్న ఉపాధ్యాయులు విద్యాభవన్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాలు కోరాయి.
విద్యాభవన్ వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన ఉపాధ్యాయులను పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకారులను అక్కడి నుంచి బలవంతంగా తరలించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఉపాధ్యాయుల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారని ఆందోళనకారులు ఆరోపించారు. దీంతో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీచర్ల నిరసన తీవ్ర చర్చనీయాంశంగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!