

కింగ్ నాగార్జున కెరీర్‌లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న క్లాసిక్ ప్రేమకథ ‘గీతాంజలి’ మరోసారి థియేటర్లలో సందడి చేయబోతోంది. లెజెండరీ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ఈ చిత్రాన్ని డిజిటల్ టెక్నాలజీతో రీమాస్టర్ చేసి 4K వెర్షన్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఆగస్టు 28న ప్రపంచవ్యాప్తంగా ఈ రీరిలీజ్ జరగనుంది. నాగార్జున పుట్టినరోజు, రాఖీ పండుగ సందర్భంగా శ్రీ పద్మిని సినిమాస్ బ్యానర్‌పై బూర్లె శివప్రసాద్ తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. అప్పట్లో ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందిన ఈ సినిమాను మరోసారి బిగ్‌స్క్రీన్‌పై చూసే అవకాశం రావడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.
నాగార్జున, గిరిజ నటనతో పాటు మణిరత్నం దర్శకత్వం, ఇళయరాజా సంగీతం ‘గీతాంజలి’కి చిరస్థాయి గుర్తింపును తీసుకొచ్చాయి. ప్రేమకథా చిత్రాల్లో ఓ క్లాసిక్‌గా నిలిచిన ఈ సినిమాను ఇప్పుడు మెరుగైన విజువల్స్, రిచ్ కలర్స్, అత్యుత్తమ సౌండ్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. దీంతో అప్పటి అభిమానులకు మధుర జ్ఞాపకాలు మరోసారి గుర్తుకురానుండగా, నేటి తరం ప్రేక్షకులకు కూడా ఈ ఎవర్‌గ్రీన్ ప్రేమకథను బిగ్‌స్క్రీన్‌పై ఆస్వాదించే అవకాశం దక్కనుంది. ఆగస్టు 28న విడుదల కానున్న ‘గీతాంజలి’కి ఎలాంటి స్పందన వస్తుందో ఆసక్తిగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!