

మెమరీ మేకర్స్ బ్యానర్‌పై హరికృష్ణ సోమిశెట్టి నిర్మించిన ‘ది రెడ్ బ్యాగ్’ చిత్రానికి రవికుమార్ సీరపు దర్శకత్వం వహించారు. కబీర్ సింగ్, ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక, ఆకాంక్ష, ఈషాన్ శంకర్, అవినాష్ బాదల్, భార్గవి, రాశీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకోగా, సంగీత ప్రచారంలో భాగంగా విడుదలైన పాటలు యూట్యూబ్‌లో మంచి స్పందనను అందుకున్నాయి.
ఈ చిత్రాన్ని ఆగస్ట్ 21న రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో విడుదల చేసేందుకు పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ సన్నాహాలు చేస్తోంది. విడుదల తేదీ ఖరారు కావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. రానున్న రోజుల్లో మరిన్ని ప్రచార కార్యక్రమాలు, కంటెంట్‌తో సినిమాపై ఆసక్తిని పెంచేందుకు చిత్రబృందం సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి ప్రియేష్ గురుస్వామి ఛాయాగ్రహణం, శివ శర్వాణి ఎడిటింగ్, శేఖర్ మోపురి సంగీతం అందించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!