

బుందేల్‌ఖండ్‌కు చెందిన దివ్యాంగ గాయకుడు సునీల్ లోధి తన గాత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. హనుమాన్ అంష్ సినిమాలో ఆయన ఆలపించిన మైనే తేరే హీ భరోసే అనే భజన్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సునీల్‌కు విస్తృతంగా ప్రశంసలు లభించాయి. స్వస్థలానికే పరిమితమైన ఆయన ప్రతిభ ఈ పాట ద్వారా ఎంతో మంది ప్రేక్షకులకు చేరువైంది.
తాజాగా సునీల్ కంటి చూపు చికిత్సకు సంబంధించి కొత్త ఆశలు కనిపిస్తున్నాయి. నిర్మాత అనుప్రియా నాగర్ సునీల్ కోసం కంటి వైద్య నిపుణుడితో అపాయింట్‌మెంట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తాను ముంబైకి తిరిగి వచ్చిన తర్వాత సునీల్‌ను చికిత్స కోసం తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. ప్రేక్షకుల నుంచి లభిస్తున్న ప్రేమను సునీల్ స్వయంగా చూడగలగాలన్నదే తన కోరిక అని ఆమె పేర్కొన్నారు. మరోవైపు మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ గతంలో సునీల్, ఆయన తల్లిదండ్రులను కలిసి వైద్య చికిత్సకు ప్రభుత్వ సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. నిపుణులైన వైద్యులు ఆయన కంటి పరిస్థితిని పరిశీలించి చూపు మెరుగుపడే అవకాశం ఉందా అనే విషయాన్ని నిర్ణయించనున్నారు. సునీల్ సంగీత విద్యకు కూడా ప్రభుత్వం సహాయం అందించనున్నట్లు సీఎం ప్రకటించారు.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!