
జనరల్

ప్రస్తుతం వరుస అవకాశాలతో కెరీర్‌లో దూసుకుపోతున్న విజయ్ వర్మ, తన సినీ ప్రయాణం అంత సులభం కాదని వెల్లడించారు. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో హైదరాబాదులో మోడలింగ్ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఓ మోడల్ కోఆర్డినేటర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని తెలిపారు. అయితే భయపడకుండా వెంటనే అతడిని నిలదీయడంతో ఆ వ్యక్తి వెనక్కు తగ్గాడని చెప్పారు.
ఇలాంటి అనుభవాలు చాలా మంది కొత్తవారిని నిరుత్సాహానికి గురి చేస్తాయని, కానీ తాను మాత్రం లక్ష్యాన్ని వదులుకోలేదని విజయ్ వర్మ అన్నారు. నటనపై ఉన్న ఆసక్తితో హైదరాబాదులోని సూత్రధార్ స్కూల్ ఆఫ్ యాక్టింగ్‌లో చేరేందుకు ప్రయత్నించగా మొదట తిరస్కరణ ఎదురైనా వెనక్కు తగ్గలేదని చెప్పారు. కష్టపడి తన ప్రతిభను నిరూపించుకుని నేడు గుర్తింపు పొందిన నటుడిగా ఎదిగానని వెల్లడించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!