
సినిమాలు

ధన్ రాజ్ లెక్కల దర్శకత్వంలో రూపొందుతున్న ‘హే చికీతా’ చిత్రం జూలై 24న విడుదల కానుందని చిత్ర బృందం వెల్లడించింది. ఈ చిత్రాన్ని ఎన్. అశోక ఆర్‌ఎన్‌ఎస్, గరుడవేగ అంజి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అభినవ్ మణికంఠ, దివిజ, తన్మయి కుషి ప్రధాన పాత్రల్లో నటించారు. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన లభించగా, ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ సహా పలువురు సినీ ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొని చిత్ర యూనిట్‌ను అభినందించారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సినిమా కంటెంట్, సంగీతం, నటనపై ప్రశంసలు కురిపించారు. రైతుల సమస్యలు, సామాజిక అంశాలతో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులకు దగ్గరగా ఉంటుందని చెప్పారు. ధన్ రాజ్ కథ, చరణ్ అర్జున్ సంగీతం, అంజి విజువల్స్ సినిమాకు బలంగా నిలుస్తాయని పేర్కొన్నారు. చిత్ర బృందం కూడా ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!