

తెలుగు సినిమా పరిశ్రమ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తన ప్రభావాన్ని చాటుతోంది. ఒకప్పుడు ప్రాంతీయ సినిమాలుగా గుర్తింపు పొందిన టాలీవుడ్ చిత్రాలు, ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్’ వంటి బ్లాక్‌బస్టర్‌లతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించాయి. గ్లోబల్ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకున్న మేకర్స్ ఇప్పుడు హాలీవుడ్, కొరియన్ నటులను కీలక పాత్రల్లో తీసుకుంటూ సినిమాలను మరింత విస్తృత స్థాయిలో రూపొందిస్తున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’లో హాలీవుడ్ నటుల భాగస్వామ్యం ఈ ట్రెండ్‌కు బలమైన ఆరంభంగా నిలిచింది.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ ‘రణబాలి’, ప్రభాస్ ‘స్పిరిట్’, మహేష్ బాబు-రాజమౌళి ప్రాజెక్ట్ ‘వారణాసి’ వంటి భారీ చిత్రాలు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారుతున్నాయి. హాలీవుడ్ స్టార్‌లను విలన్లుగా తీసుకొచ్చే ప్రయత్నాలు, భారీ బడ్జెట్‌లు, ప్రపంచవ్యాప్తంగా విడుదలలు టాలీవుడ్‌ను ‘పాన్ వరల్డ్’ స్థాయికి తీసుకెళ్తున్నాయి. దీంతో తెలుగు సినిమా మార్కెట్ అమెరికా, యూరప్, జపాన్, కొరియా వంటి దేశాల్లో మరింత విస్తరిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!