

టాలీవుడ్‌లో నేచురల్ బ్యూటీగా గుర్తింపు పొందిన సాయి పల్లవి ప్రస్తుతం తెలుగు, బాలీవుడ్ చిత్రాలతో బిజీగా ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె కిస్సింగ్ సన్నివేశాలపై తన అభిప్రాయాన్ని వెల్లడించింది. తాను అలాంటి సన్నివేశాల్లో నటించనని తెలిసినా ఇప్పటికీ చాలా మంది దర్శకులు అడుగుతూనే ఉంటారని తెలిపింది. ఒకవేళ తనకు జీవిత భాగస్వామి ఉంటే, నటన పేరుతో అయినా వేరొకరిని ముద్దు పెట్టుకోవడం తనకు సరైనదిగా అనిపించదని చెప్పింది.
జీవితంలో సంతోషంగా ఉండేందుకు మంచి కుటుంబం, ఒక ఇల్లు, ఒక కారు ఉంటే చాలనేది తన అభిప్రాయమని సాయి పల్లవి పేర్కొంది. "మరో కారు కొనడం కోసం వేరొకరిని ముద్దు పెట్టుకోవాల్సిన అవసరం నాకు లేదు" అని స్పష్టం చేసింది. నటన కోసం తనను ఎంపిక చేసుకోవచ్చని, కానీ సన్నిహిత సన్నివేశాలు అవసరమైతే వేరే నటిని తీసుకోవచ్చని తెలిపింది. ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, డబ్బు కంటే విలువలకు ప్రాధాన్యం ఇస్తున్నందుకు అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!