

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా, ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇరుముడి’ విడుదలైనప్పటి నుంచి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మంచి స్పందన లభిస్తోందని చిత్ర బృందం చెబుతోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సినిమాకు ఆదరణ రోజురోజుకూ పెరుగుతున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా పండుగ రోజుల్లో టికెట్ బుకింగ్స్ భారీగా ఉంటాయి. అయితే ‘ఇరుముడి’ సాధారణ పనిదినాల్లోనూ అదే స్థాయిలో ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తున్నట్లు సమాచారం.
సోమవారం నుంచి గురువారం వరకు వరుసగా నాలుగు రోజుల్లో అత్యధిక టికెట్లు అమ్ముడైన ప్రాంతీయ చిత్రంగా ‘ఇరుముడి’ రికార్డు సాధించిందని చిత్ర బృందం పేర్కొంది. ఎలాంటి పండుగ సీజన్ లేకుండానే ఈ స్థాయి బుకింగ్స్ నమోదవడం ప్రత్యేకతగా మారింది. ఇది రవితేజ కెరీర్‌లోనే కాకుండా టాలీవుడ్‌లోనూ అరుదైన ఘనతగా చెప్పుకుంటున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ అందించిన సంగీతం సినిమాకు అదనపు ఆకర్షణగా నిలవగా, మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఇప్పటికే వసూళ్లలో దూసుకుపోతున్న ‘ఇరుముడి’ భవిష్యత్‌లో ఎలాంటి రికార్డులు నమోదు చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!