

ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ సినిమాపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా మలయాళ నటి దర్శన రాజేంద్రన్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారనే వార్తలు సినీ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. కథలో భావోద్వేగాలకు ప్రాధాన్యం ఉన్న భాగంలో ఆమె పాత్ర కనిపించనుందని సమాచారం. అలాగే తదుపరి షూటింగ్ షెడ్యూల్‌లో ప్రత్యేక గీతం చిత్రీకరణకు సన్నాహాలు జరుగుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.
ప్రశాంత్ నీల్ తనకు ప్రత్యేకమైన డార్క్ విజువల్ స్టైల్‌కు భిన్నంగా ఈ చిత్రంలో కొత్త ప్రయోగాలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్లను ప్రకాశవంతమైన రంగులు, ఉత్సాహభరితమైన విజువల్స్‌తో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. భారీ యాక్షన్‌తో పాటు బలమైన భావోద్వేగ కథనం కూడా ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!