
సినిమాలు

దక్షిణాది సినీ పరిశ్రమలో ఆదర్శ దంపతులుగా గుర్తింపు పొందిన సూర్య-జ్యోతిక జంట తాజాగా ఓ బాలీవుడ్ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. కుటుంబ వ్యవహారాల నుంచి సినిమా నిర్మాణాల వరకు ప్రతి నిర్ణయాన్ని కలిసి తీసుకుంటామని జ్యోతిక వెల్లడించారు. సూర్యలో ఎలాంటి లింగ వివక్ష భావన ఉండదని, సమానత్వాన్ని ఎప్పుడూ గౌరవించే వ్యక్తి అని ఆమె ప్రశంసించారు.
తన నిర్ణయాలకు సూర్య ఎప్పుడూ విలువ ఇస్తారని, ఒకరి విజయాన్ని మరొకరు ఆనందంగా స్వీకరించడమే తమ బంధానికి బలమని జ్యోతిక తెలిపారు. కెరీర్ ప్రారంభంలో తన పారితోషికం సూర్య కంటే మూడింతలు ఎక్కువగా ఉండేదని, ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారిందని చెప్పారు. జ్యోతిక వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, అభిమానులు సరదాగా స్పందిస్తూ ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!