

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘కాకా’ విడుదలకు ముందే బాక్సాఫీస్ వర్గాల్లో ఆసక్తి పెంచుతోంది. దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా విడుదలకు ముందే వ్యాపార పరంగా మంచి వేగం అందుకుంటోంది. ముఖ్యంగా తెలంగాణ ప్రాంత హక్కులు భారీ ధరకు అమ్ముడైనట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
ప్రముఖ ఆసియన్ సంస్థ ఈ సినిమా తెలంగాణ హక్కులను సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఇందుకోసం ఏకంగా 35 కోట్లకు పైగా చెల్లించినట్లు తెలుస్తోంది. సంక్రాంతి బరిలో పెద్ద సినిమాల మధ్య తీవ్ర పోటీ ఉన్నప్పటికీ ఇంతటి ధర పలకడం విశేషంగా మారింది. చిరంజీవి స్టార్‌డమ్‌తో పాటు బాబీ దర్శకత్వంపై ఉన్న నమ్మకమే ఈ స్థాయి వ్యాపారానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా, కే వి ఎన్ నిర్మాణ సంస్థ నిర్మాణ బాధ్యతలు చేపట్టింది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!