
జనరల్

నటి కృతి సనన్ నటించిన ఓ ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ రక్షాబంధన్ ప్రకటన సోషల్ మీడియాలో వివాదానికి దారి తీసింది. ఈ యాడ్‌లో కృతి ధరించిన దుస్తులపై కొందరు నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తూ భారతీయ పండుగను ఇలా చూపించడం సరికాదని విమర్శిస్తున్నారు. అలాగే కుక్క తనపై మొరిగిన తర్వాత దానికి కృతి రాఖీ కట్టే సన్నివేశంపైనా కొందరు నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఈ వివాదంపై నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందించారు. కృతి సనన్ పేరును నేరుగా ప్రస్తావించకపోయినా, ఆమె నటించిన ప్రకటన గురించే తన వ్యాఖ్యలు అని కంగనా స్పష్టం చేశారు. రక్షాబంధన్ వంటి పండుగకు యాడ్‌లో అలాంటి దుస్తులను ఎందుకు ఎంచుకున్నారని ప్రశ్నిస్తూ, ప్రకటనను తీవ్రంగా విమర్శించారు. అయితే ఈ వివాదంపై కృతి సనన్ ఇప్పటివరకు స్పందించలేదు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!