

నూతన ప్రతిభను ప్రోత్సహించే ఉద్దేశంతో 100 మంది కొత్త నటీనటులను పరిచయం చేస్తూ రూపొందిన చిత్రం ‘కొత్త సినిమా’. ఈ మూవీకి సంబంధించిన ప్రత్యేక కార్యక్రమాన్ని హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ఘనంగా నిర్వహించారు. “Why Only Hyderabad? Why Not in Our Place?” అనే వినూత్న కాన్సెప్ట్‌తో నిర్వహించిన ఈ కార్యక్రమానికి చిత్ర బృందంతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.
ప్రముఖ దర్శకులు వేణు ఉడుగుల, ఎన్. శంకర్, వీర శంకర్, సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, సినీ విమర్శకులు చల్లా శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. 100 మంది నూతన నటీనటులతో సినిమా రూపొందించడం సాహసోపేతమైన ప్రయత్నమని వారు పేర్కొన్నారు. సినిమా నిర్మాణంలో చిత్ర బృందం ఎదుర్కొన్న సవాళ్లు, వారి పట్టుదలను ప్రశంసించారు.
కార్యక్రమంలో నిర్వహించిన ప్రత్యేక ప్రశ్నోత్తరాల సెషన్ కూడా ఆకట్టుకుంది. స్థానిక ప్రతిభకు మరిన్ని అవకాశాలు కల్పించడం, చిన్న సినిమాలను ప్రోత్సహించడం వంటి అంశాలపై చర్చ జరిగింది. సరికొత్త అనుభూతిని అందించేందుకు వస్తున్న ‘కొత్త సినిమా’ను ప్రేక్షకులు ఆదరిస్తారని, కొత్త నటీనటులకు మంచి గుర్తింపు లభిస్తుందని చిత్ర యూనిట్ విశ్వాసం వ్యక్తం చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!