

యువ హీరో కిరణ్ అబ్బవరం తన సినీ కెరీర్‌లో ఓ భారీ ప్రాజెక్ట్‌ను వదులుకున్న విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న ‘సంబరాల ఏటి గట్టు’ చిత్రం మొదట తన వద్దకే వచ్చిందని తెలిపారు. దర్శకుడు రోహిత్‌తో ‘ఎస్‌ఆర్ కళ్యాణ మండపం’ సమయంలో పరిచయం ఏర్పడిందని, తొలుత ఈ కథను చిన్న బడ్జెట్ చిత్రంగా తనకు వినిపించారని చెప్పారు. ఆ తర్వాత కథను విస్తరించి భారీ స్థాయిలో రూపొందించేలా మార్చినట్లు వివరించారు.
తన సినిమాలు వరుసగా పరాజయాలు ఎదుర్కొంటున్న సమయంలో భారీ బడ్జెట్ చిత్రాన్ని చేయడం సరైన నిర్ణయం కాదని భావించినట్లు కిరణ్ అబ్బవరం తెలిపారు. రూ.2 కోట్ల బడ్జెట్‌తో ప్రారంభమైన ప్రాజెక్ట్ క్రమంగా రూ.70-80 కోట్ల స్థాయికి చేరుకోవడంతో, తన మార్కెట్‌కు అది సరిపోదని భావించి తప్పుకున్నానని చెప్పారు. నిర్మాత నిరంజన్ ఈ చిత్రాన్ని తనతోనే చేయాలని ప్రయత్నించినప్పటికీ తానే వెనక్కి తగ్గినట్లు తెలిపారు. అనంతరం ఈ సినిమా సాయి ధరమ్ తేజ్ వద్దకు వెళ్లడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!