

రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘మైసా’ విడుదల తేదీని మేకర్స్ కొత్త పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. రవీంద్ర పుల్లే దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం 2026 నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. తాజా పోస్టర్‌లో రష్మిక చీరకట్టులో, చేతికి విరిగిన సంకెళ్లతో, మరో చేతిలో ఈటె పట్టుకుని యోధురాలిగా కనిపిస్తోంది. ఒంటిపై గాయాలు ఉన్నప్పటికీ ఆమె కళ్లలో కనిపించే రౌద్రం సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.

‘మైసా’ షూటింగ్ సమయంలో రష్మిక హిప్ ఇంజురీకి గురైన విషయం తెలిసిందే. వైద్యుల సూచన మేరకు కొన్ని వారాలు షూటింగ్‌కు దూరంగా ఉండి విశ్రాంతి తీసుకున్న ఆమె, ప్రస్తుతం కోలుకుని తిరిగి సెట్స్‌పైకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. అన్ ఫార్ములా ఫిల్మ్స్ బ్యానర్‌పై అజయ్ సాయిపురెడ్డి, అనిల్ సయ్యపురెడ్డి, వీరసాయి గోప నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ రెడ్డి సాథి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఆడియో హక్కులను టీ-సిరీస్, డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!