

యువ నటి మమితా బైజు దక్షిణాది చిత్రసీమలో వరుస అవకాశాలతో తన కెరీర్‌ను వేగంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ‘ప్రేమలు’ విజయంతో మంచి గుర్తింపు పొందిన ఆమె, ఇప్పుడు కేవలం 30 రోజుల వ్యవధిలో తమిళం, తెలుగు, మలయాళ భాషల్లో మూడు ప్రతిష్టాత్మక చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఒకే నెలలో మూడు భాషల్లో విడుదలలు ఉండటం ఆమె కెరీర్లో అరుదైన ఘట్టంగా సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.
మమితా నటించిన ‘జన నాయగన్’ జూలై 23న విడుదల కానుండగా, ఇందులో ఆమె కీలక పాత్రలో కనిపించనున్నారు. అనంతరం వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య హీరోగా తెరకెక్కిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ఆగస్ట్ 14న విడుదల కానుంది. ఆ తర్వాత నివిన్ పాలీతో కలిసి నటించిన ‘బెత్లెహెం కుడుంబా యూనిట్’ ఆగస్ట్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. వరుసగా మూడు భాషల్లో మూడు చిత్రాల విడుదలతో మమితా బైజు ప్రస్తుతం దక్షిణాది చిత్రసీమలో హాట్ టాపిక్‌గా మారారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!