

నేషనల్ క్రష్ రష్మికమందన్న తాజాగా నిర్వహించిన ఇన్స్టాగ్రామ్ ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ సెషన్లో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంది. తన జీవితంలో తీసుకున్న అత్యంత సంతోషకరమైన నిర్ణయం ఏంటని అడగ్గా, “నా బెస్ట్ ఫ్రెండ్ విజయ్‌దేవరకొండ ను పెళ్లి చేసుకోవడమే” అంటూ స్పందించింది. ప్రస్తుతం తన జీవితం ‘డ్రీమ్ కమ్ ట్రూ’లా ఉందని పేర్కొంటూ ఆనందం వ్యక్తం చేసింది. ఉడయ్‌పూర్‌లో 2026 ఫిబ్రవరి 26న వీరిద్దరూ అత్యంత సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకున్నట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి.
తన గ్లోయింగ్ సీక్రెట్ గురించి మాట్లాడిన రష్మిక, మనల్ని మనం అర్థం చేసుకునే భాగస్వామి జీవితాన్ని మరింత అందంగా మారుస్తారని తెలిపింది. మరోవైపు కెరీర్ పరంగా కూడా ఆమె జోరు కొనసాగుతోంది. ‘కాక్టెయిల్ 2’, ‘మైసా’, ‘రణబలి’ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో బిజీగా ఉన్న రష్మిక, ‘రణబలి’ చిత్రంలో విజయ్ దేవరకొండతో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోనుంది. పెళ్లి తర్వాత ఈ జోడీ కలిసి నటిస్తున్న తొలి చిత్రం కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!