
ఓటీటీ

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘డ్రాగన్’పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విడుదలైన ప్రచార వీడియోలతో అంచనాలు పెరిగిపోగా, షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. ఎన్టీఆర్‌ను కొత్త కోణంలో చూపించేందుకు దర్శకుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు సమాచారం.
తాజా సమాచారం ప్రకారం, తదుపరి షెడ్యూల్‌లో హై ఇంటెన్సిటీ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరించనున్నారు. అదే సమయంలో ఒక ప్రత్యేక గీతం కూడా షూట్ చేసే అవకాశం ఉంది. అలాగే శ్రీలంకలో కీలక సన్నివేశాలు చిత్రీకరించే ప్రణాళికలు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి సంగీతం రవి బస్రూర్ అందిస్తుండగా, ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!