

సంక్రాంతికి ‘ది రాజా సాబ్’ విడుదలైన తర్వాత ప్రభాస్ ఏడాది చివర్లో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఆయన ప్రస్తుతం నటిస్తున్న ప్రాజెక్టుల్లో హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ చిత్రం వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 3న విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
ఇంకా, స్వాతంత్ర్య దినోత్సవం (ఆగస్టు 15) సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రత్యేక గ్లింప్స్ విడుదల చేయాలని టీమ్ ప్లాన్ చేస్తోంది. ఇది అభిమానులకు విజువల్ ట్రీట్‌గా ఉండనుందని సమాచారం. ఇందులో ప్రభాస్ ఇప్పటివరకు చూడని పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాలో ఇమాన్వీ హీరోయిన్‌గా నటిస్తుండగా, అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద, భాను చందర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, టీ-సిరీస్ (గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్ సమర్పణలో) సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!