
జనరల్

నితిన్, ఆఫియా సయ్యద్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘అలియాస్ రుక్మిణి’ షూటింగ్ పూర్తయింది. ప్రణాళిక, పట్టుదల, ప్రేమతో సినిమా చిత్రీకరణను విజయవంతంగా పూర్తి చేసినట్లు చిత్రబృందం వెల్లడించింది. మురళీ కాంత్ దేవసోత్ రచించి, దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రేక్షకులకు తెరపై ఓ అందమైన కథను అందించేందుకు సిద్ధమవుతోంది.
యూనానిమస్ ప్రొడక్షన్స్ పతాకంపై దీప్తి గంతా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాని సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. షూటింగ్ పూర్తయిన నేపథ్యంలో చిత్రబృందం తదుపరి కార్యక్రమాలపై దృష్టి పెట్టింది. ‘అలియాస్ రుక్మిణి’ డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!