

ప్రియదర్శి, నాగదుర్గ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఇడుపు కాయితం’. దొండపాటి వంశీరెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో చిత్రబృందం తాజాగా టీజర్‌ను విడుదల చేసింది. ఇందులో ప్రధాన పాత్రల మధ్య కెమిస్ట్రీతో పాటు సినిమా కథాంశంపై ఆసక్తికరమైన క్లూస్ ఇచ్చింది.
అందంగా సాగుతున్న ఓ పెళ్లిబంధం చివరకు ఇడుపు కాయితం వరకు ఎందుకు వెళ్లింది? ఆ తర్వాత వారి జీవితాల్లో ఏం జరిగింది? అనే ఆసక్తికరమైన కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు టీజర్‌ను బట్టి తెలుస్తోంది. ఇందులో ప్రియదర్శి, నాగదుర్గ మధ్య వచ్చే సరదా సంభాషణ ఆకట్టుకుంటోంది. ‘ఏడవొద్దు శ్రీలత.. మేకప్ పోతోంది. ముక్కు కారుతోంది’ అని ప్రియదర్శి అనగా, ‘ముక్కొస్తే లవ్ చేయవా?’ అంటూ నాగదుర్గ గోముగా సమాధానమివ్వడం నవ్వులు పూయిస్తోంది. టీజర్‌తో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!