

నటుడు సూర్య, దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళితో కలిసి పనిచేసే అవకాశాన్ని గతంలో కోల్పోయిన విషయాన్ని పలుమార్లు ప్రస్తావించారు. రాజమౌళి తనను ఓ కీలక పాత్ర కోసం సంప్రదించారని, అయితే అప్పట్లో ఆ పాత్రపై పూర్తిగా నమ్మకం కలగకపోవడంతో తాను ఆ అవకాశాన్ని తీసుకోలేదని సూర్య వెల్లడించారు. ఆ తర్వాత ఈ నిర్ణయం ఒక పెద్ద అవకాశాన్ని కోల్పోవడమేనని భావిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో రాజమౌళితో కలిసి పనిచేసే అవకాశం వస్తే తప్పకుండా సిద్ధంగా ఉన్నానని చెప్పారు.
2024లో హైదరాబాద్‌లో జరిగిన కంగువ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లోనూ సూర్య, రాజమౌళి ఈ విషయాన్ని ప్రస్తావించారు. సూర్య తనకు పాన్-ఇండియా సినిమాల ఆలోచనకు స్ఫూర్తినిచ్చారని రాజమౌళి ప్రశంసించారు. గతంలో సూర్యతో కలిసి పనిచేసే అవకాశాన్ని తానే కోల్పోయానని రాజమౌళి అన్నారు. దీనికి స్పందించిన సూర్య, తాను ఆ ‘రైలు’ను మిస్ చేసుకున్నానని, మరో అవకాశం కోసం ఇంకా రైల్వే స్టేషన్‌లోనే ఎదురుచూస్తున్నానని సరదాగా వ్యాఖ్యానించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!