
సినిమాలు

కృత్రిమ మేధ (ఏఐ) దుర్వినియోగంతో రూపొందుతున్న డీప్‌ఫేక్ చిత్రాలు ప్రముఖులను ఇబ్బందులకు గురిచేస్తూనే ఉన్నాయి. తాజాగా నటి మృణాల్ ఠాకూర్ డీప్‌ఫేక్ ఫొటోల బారిన పడ్డారు. సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో ఆమెకు సంబంధించిన మార్ఫింగ్ చిత్రాలు కనిపించడంతో అవి వైరల్‌గా మారాయి.
ఈ ఘటనపై స్పందించిన మృణాల్ ఠాకూర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అనుమతి లేకుండా డీప్‌ఫేక్ ఫొటోలు సృష్టించి సోషల్ మీడియాలో ప్రచారం చేయడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. వెంటనే వాటిని తొలగించాలని, లేదంటే న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఇకపై ఆ ఫొటోలను షేర్ చేసే వారిపై కూడా చర్యలు తీసుకుంటామని ఆమె స్పష్టం చేశారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!