

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న జైలర్ 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. తొలి భాగాన్ని తెరకెక్కించిన నెల్సన్ దిలీప్‌కుమార్‌నే సీక్వెల్‌కు కూడా దర్శకత్వం వహిస్తున్నారు. జైలర్ విజయంలో కథ, యాక్షన్‌తో పాటు సర్ప్రైజ్ కామియోలు కీలక పాత్ర పోషించాయి. శివ రాజ్‌కుమార్, మోహన్‌లాల్ వంటి దిగ్గజ నటులు ప్రత్యేక పాత్రల్లో కనిపించడం థియేటర్లలో ప్రేక్షకులకు ప్రత్యేక అనుభూతిని అందించింది.
ఇదే తరహాలో జైలర్ 2లోనూ మరిన్ని సర్ప్రైజ్ కామియోలు ఉండనున్నట్లు ఇప్పటికే ఆసక్తి నెలకొంది. తాజాగా నేటి సాయంత్రం నుంచి సినిమాలోని కొత్త పాత్రలను పరిచయం చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో థియేటర్లలో చూడాల్సిన ముఖ్యమైన సర్ప్రైజ్ పాత్రలను ముందుగానే వెల్లడిస్తారా, లేక కొన్ని కీలక కామియోలను విడుదల వరకు గోప్యంగా ఉంచుతారా అనే చర్చ మొదలైంది. అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!