

పద్మశ్రీ పురస్కారం అందుకున్న సందర్భంగా ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ నిర్వహించిన 'మీట్ ది ప్రెస్' కార్యక్రమంలో ప్రముఖ నటుడు, నిర్మాత మురళీమోహన్ తన సినీ, వ్యక్తిగత జీవిత విశేషాలను పంచుకున్నారు. "నా జీవితం ఒక తెల్లకాగితం లాంటిది. దానిపై ఎలాంటి మచ్చ పడనివ్వకుండా జీవించాను" అని ఆయన అన్నారు. తన ఎదుగుదలకు గుప్త మాణిక్యాలరావు, అట్లూరి పూర్ణచంద్రరావు, దాసరి నారాయణరావు, శోభన్ బాబు చేసిన సహాయాన్ని జీవితాంతం మరవలేనని పేర్కొన్నారు. నిజాయితీ, క్రమశిక్షణ, విలువలతో జీవించడం తన విజయానికి కారణమని చెప్పారు.
సినీ జీవితంతో పాటు సామాజిక సేవ కూడా తనకు సమానంగా ముఖ్యమని మురళీమోహన్ తెలిపారు. వేలాది మంది విద్యార్థులకు విద్యా సహాయం అందించామని, ఎలాంటి ప్రచారం లేకుండా సేవా కార్యక్రమాలు నిర్వహించానని వెల్లడించారు. నటుడిగా, నిర్మాతగా, వ్యాపారవేత్తగా ప్రతి రంగంలో నైతిక విలువలను పాటించానని చెప్పారు. ఈ కార్యక్రమంలో సినీ విమర్శకులు, జర్నలిస్టులు, సినీ ప్రముఖులు పాల్గొని మురళీమోహన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!