

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నటి రకుల్ ప్రీత్ సింగ్ తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఆర్మీ కుటుంబంలో జన్మించిన తనకు ఆగస్టు 15 అంటే ఎంతో ప్రత్యేకమని తెలిపారు. ఆమె తండ్రి కుల్విందర్ సింగ్ భారత సైన్యంలో కల్నల్‌గా పనిచేసి పదవీ విరమణ చేశారు. ఆయన బదిలీల కారణంగా రకుల్ బాల్యం బోర్డర్ ప్రాంతాల్లో, ఆర్మీ వాతావరణంలోనే గడిచింది. దిల్లీలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్‌లో చదువుకున్న ఆమె.. పాఠశాలలో నిర్వహించే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు తన జీవితంలోని అత్యుత్తమ జ్ఞాపకాల్లో ఒకటిగా నిలిచాయని చెప్పారు.
పాఠశాల రోజుల్లో దేశభక్తి గీతాల పోటీల్లో ఉత్సాహంగా పాల్గొనేదానినని, దేశం కోసం పాటలు పాడటం ఎంతో గర్వంగా అనిపించేదని రకుల్ గుర్తుచేసుకున్నారు. తనకు స్వాతంత్ర్య దినోత్సవం కేవలం సెలవు రోజు కాదని, ఓ పెద్ద పండగలా భావిస్తానని తెలిపారు. ఇక సినిమాల విషయానికొస్తే.. దర్శకుడు నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘రామాయణ’లో రకుల్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో ఆమె శూర్పణఖ పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!