
జనరల్

నేచురల్ స్టార్ నాని హీరోగా, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ది ప్యారడైజ్’ నుంచి ఆసక్తికరమైన అప్‌డేట్ వచ్చింది. చిత్ర బృందం విడుదల చేసిన కొత్త పోస్టర్‌లో మేఘాలతో నిండిన ఆకాశం మధ్య తెల్ల పావురం కనిపిస్తుండగా, కింద భాగంలో విధ్వంసాన్ని తలపించే దృశ్యాలు కనిపిస్తున్నాయి. పోస్టర్‌పై “టుడే 6:03 PM” అని పేర్కొనడం అభిమానుల్లో ఉత్కంఠను పెంచుతోంది.

సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. పోస్టర్‌లోని ప్రతీకాత్మక అంశాలు సినిమా కథపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ సాయంత్రం 6:03 గంటలకు చిత్రానికి సంబంధించిన టీజర్, గ్లింప్స్ లేదా మరో కీలక ప్రకటన వచ్చే అవకాశముందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో నాని అభిమానులు అప్‌డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!