

అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మైథలాజికల్ థ్రిల్లర్ ‘వృషకర్మ’లో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా కనిపించనున్నారు. ‘తండేల్’ విజయానంతరం నాగచైతన్య నటిస్తున్న సినిమా కావడం, అలాగే ‘విరూపాక్ష’ దర్శకుడు కార్తీక్ దండు ప్రాజెక్ట్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి సంబంధించిన నాన్-థియేట్రికల్ హక్కులను ప్రముఖ జీ సంస్థ భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ చిత్రంలో స్పర్శ్ శ్రీవాత్సవ్ విలన్‌గా, జయరామ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. బి. అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తుండగా, ప్రముఖ దర్శకుడు సుకుమార్ కథను అందించారు. బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ మరియు సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై తెరకెక్కుతోంది. సినిమా భారీ విజువల్స్‌తో మైథలాజికల్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!