
సినిమాలు

రాజ్ కుంద్రా ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో, రాజస్థాన్ రాయల్స్‌లో చేసిన తన పెట్టుబడి భార్య శిల్పా శెట్టికి వాలెంటైన్స్ డే కానుకగా పెట్టినదని వెల్లడించారు. 2009లో జట్టు తొలి ఇండియన్ ప్రీమియర్ లీగ్ టైటిల్ గెలిచిన వెంటనే రూ.81.9 కోట్లతో 11.7 శాతం వాటాను కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఆ సమయంలో ఇది ఐపీఎల్‌లో అతిపెద్ద సింగిల్ చెక్ పెట్టుబడిగా పేర్కొన్నారు.
అయితే 2013 బెట్టింగ్ వివాదం కారణంగా ఆయనపై నిషేధం విధించడంతో జట్టుతో సంబంధం ముగిసింది. అయినప్పటికీ, ఈ పెట్టుబడి విలువ గణనీయంగా పెరిగిందని చెప్పారు. 2009లో సుమారు రూ.700 కోట్లుగా ఉన్న జట్టు విలువ ప్రస్తుతం రూ.16,000 కోట్లకు చేరిందని తెలిపారు. దీన్ని అత్యంత లాభదాయక పెట్టుబడిగా, చరిత్రలోనే అత్యంత ఖరీదైన వాలెంటైన్స్ కానుకగా అభివర్ణించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!