

పురాణ గాథలను ఆధునిక సాంకేతికతతో మేళవిస్తూ రూపొందుతున్న ‘నాగబంధం’ చిత్రం విడుదలకు ముందే సినీ అభిమానుల్లో విశేష ఆసక్తిని రేకెత్తిస్తోంది. మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విరాట్ కర్ణ, నభా నటేష్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. భారీ నిర్మాణ విలువలు, అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్, అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయని చిత్రబృందం వెల్లడిస్తోంది. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకోవడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
జూలై 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ‘నాగబంధం’ను అమెరికాలో మాత్రం ఒక రోజు ముందుగానే ప్రదర్శించనున్నారు. జూలై 2న ప్రత్యేక ప్రీమియర్ షోలను నిర్వహించనున్నట్లు సమాచారం. సుమారు రూ.100 కోట్ల వ్యయంతో నిర్మితమైన ఈ చిత్రం విజువల్ స్పెక్టకిల్‌గా ప్రేక్షకులను అలరించనున్నదనే నమ్మకం యూనిట్‌లో వ్యక్తమవుతోంది. ఉత్తర అమెరికాలో తెలుగు వెర్షన్‌ను 250కు పైగా కేంద్రాల్లో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. పురాణ అంశాలను ఆధునిక కథన శైలితో మేళవించిన ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తుందనే అంచనాలు ఉన్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!