
షోస్

కింగ్ నాగార్జున అభిమానులకు మరోసారి పండగ రానుంది. అక్కినేని నాగార్జున కెరీర్లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న క్లాసిక్ రొమాంటిక్ చిత్రం ‘గీతాంజలి’ మరోసారి థియేటర్లలోకి రానుంది. ప్రముఖ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ఈ చిత్రాన్ని నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 28, 2026న గ్రాండ్గా రీ-రిలీజ్ చేయనున్నట్లు ప్రత్యేక పోస్టర్ ద్వారా ప్రకటించారు.
ఈ పోస్టర్లో నాగార్జునతో పాటు సంగీత దర్శకుడు ఇళయరాజా, సినిమాటోగ్రాఫర్ పి.సి. శ్రీరామ్ పేర్లను కూడా ప్రస్తావించారు. ప్రేమ, భావోద్వేగాలు, మణిరత్నం ప్రత్యేకమైన కథనం, నాగార్జున అద్భుతమైన నటనతో ‘గీతాంజలి’ ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసింది. ఇప్పుడు ఈ క్లాసిక్ మరోసారి బిగ్స్క్రీన్పై సందడి చేయనుండటంతో అక్కినేని అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!