
షోస్

1984 సిక్కుల ఊచకోత కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న మాజీ కాంగ్రెస్ నేత సజ్జన్ కుమార్ మృతి చెందారు. ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్న ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు సమాచారం.
1984లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్య అనంతరం దేశవ్యాప్తంగా సిక్కులపై హింస చెలరేగింది. ఈ ఘటనలకు సంబంధించి సజ్జన్ కుమార్‌పై నమోదైన కేసుల్లో ఇద్దరు సిక్కుల హత్యకు సంబంధించిన కేసులో ఆయన దోషిగా తేలారు. అనంతరం కోర్టు ఆయనకు జీవిత ఖైదు విధించింది.
1984 సిక్కుల వ్యతిరేక హింసకు సంబంధించిన దీర్ఘకాలిక న్యాయ ప్రక్రియలో సజ్జన్ కుమార్ కేసు కీలకంగా నిలిచింది. ప్రస్తుతం ఆయన మరణంతో జైలు శిక్ష అనుభవిస్తున్న ఆయన జీవితం ముగిసింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!